
పర్యావరణ చవితి వేడుకలకు ప్రాధాన్యం నగరంలో విక్రయానికి సిద్ధంగా మట్టి ప్రతిమలు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కంబాలచెరువు న్యూస్‌టుడే : వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లక్ష్మీవారపుపేటలో వనమూలికతో ఏడున్నర అడుగుల గణనాథుడు.. జిల్లాలో మొత్తం ఆదివారం సాయంత్రం వరకు అధికారికంగా 2,988 వినాయక మండపాల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. వీటిలో దాదాపు 85 శాతం నిర్వాహకులకు నిబంధనలు వివరించి అనుమతులు మంజూరు చేశారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 1950 మండపాలకు అనుమతులు కోరితే ఇప్పుడు 3 వేలు దాటింది. రాజమహేంద్రవరం నగరంలోనే వెయ్యికి పైగా .. కొవ్వూరు సబ్‌డివిజన్‌ 800 మండపాలకు అనుమతులిచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. డీజే సౌండ్‌తో వచ్చే అధిక శబ్ద కాలుష్యంతో గతేడాది చాలా మంది వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం డీజేకు అనుమతి లేదు. మండపాల వద్ద తాత్కాలికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి పది గంటల తరువాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. అని ఎస్పీ డి.నరసింహకిశోర్‌ అన్నారు. గాల్లోకి ఎగిరే ‘ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌’ పొడిని పీల్చితే ఊపిరితిత్తులు పాడైపోతాయి. కలుషిత నీటి ద్వారా కాలువలు, చెరువులు, నదులు విషతుల్యమై పంటలు నాశనమైపోతాయి. ఆ నీటిని తాగితే క్యాన్సర్‌ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ హితంగా పండగ చేసుకుంటే ఎంతో మేలు. పతంజలిశాస్త్రి, పర్యావరణ శాస్త్రవేత్త .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





