
న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌ పట్టణాల్లో ఏ రెస్టారెంట్, హోటల్‌కు వెళ్లినా పనీర్‌తో తయారు చేసిన రకరకాల వంటకాలు నోరూరిస్తాయి. ఇళ్లలోనూ తయారు చేసుకుని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. జిల్లా వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో లభ్యమవుతున్న పనీర్‌ నాణ్యతపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో ఆహార భద్రతా విభాగంలో కేవలం ఒక్కరే అధికారి ఉన్నారు. దీంతో ఆహార నాణ్యత తనిఖీ ఊసే ఉండటం లేదు. అప్పుడప్పుడూ కొంత మంది సిబ్బందితో దాడులు నిర్వహిస్తున్నా అక్రమాలకు అడ్డుకట్టపడటం లేదు. హానికరమైన అనలాగ్‌ పనీర్‌ను పాలు అవసరం లేకుండా కొన్ని రకాల రసాయనాలతో కృత్రిమంగా తయారు చేస్తారు. దీనికొ కొద్దిమొతంలో పాలపొడికి కొన్ని రకాల నూనేలు, రసాయనాలు కలిపి సిద్ధం చేస్తున్నారు. లీటరు పాల నుంచి కేవలం 150 గ్రాముల వరకు మాత్రమే పనీర్‌ వస్తుంది. కృత్రిమ పనీర్‌ కేజీ రూ.50 లోపే తయారవుతోంది. అనలాగ్‌ పనీర్‌లో వినియోగించే నూనెలు, కొవ్వు పదార్థాల వల్ల ట్రాన్స్‌ ఫ్యాట్స్, చెడు కొలస్ట్రాల్‌ పెరిగిపోతుంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండెపోటుకు కారణమవుతుంది. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, తీవ్ర కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. స్వచ్ఛమైన పనీర్‌ మెత్తగా, పాల వాసన వస్తుంది. కృత్రిమైతే నమిలే సమయంలో రబ్బరు మాదిరిగా సాగుతుంది. ఉడికించిన తర్వాత రెండు చుక్కలు ఆయోడిన్‌ ద్రావణం పోస్తే అది నీలం రంగులోకి మారితే కల్తీగా గుర్తించవచ్చు. జిల్లాలో ప్రభుత్వం వద్ద అనుమతులు పొందిన హోటళ్లు 635, రెస్టారెంట్లు 152 వరకు ఉన్నాయి. క్యాటరింగ్‌ చేసే దుకాణాలు 400 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో నిత్యం 750 కేజీల వరకు పనీర్‌ ఉత్పత్తులు తయార వుతుండగా స్వచ్ఛమైనవి 20 నుంచి 30 శాతం మాత్రమేనని అంచనా. ఆహార భద్రతాధికారి రామయ్యను వివరణ కోరగా పనీర్‌ అమ్మకాలు చేసే దుకాణాల్లో తనిఖీలు చేపట్టి నమూనాలు సేకరిస్తామన్నారు. రసాయనాలు, స్టార్చ్, వనస్పతి, పామాయిల్‌ వంటి పదార్థాలతో అన్‌లాగ్‌ పనీర్‌ను కృత్రిమంగా తయారు చేసి విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, రోజువారీగా ఆహార పదార్థాలు తయారు చేసే క్యాటరింగ్‌ నిర్వాహకులు వీటితోనే పనీర్‌ వంటకాలు తయారే చేసి వడ్డిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





