
నూతన పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల కడియం, న్యూస్‌టుడే: కడియం నర్సరీల ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. కడియపులంక సర్‌ ఆర్థర్‌కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ పాలకవర్గం కొత్తగా కొలువుదీరింది. వారితో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. ఆదివారం జీఎన్‌ఆర్‌ కల్యాణమండపంలో కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా మంత్రి దుర్గేష్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. గోరంట్ల సభకు అధ్యక్షత వహించారు. మంత్రి మాట్లాడుతూ నర్సరీ రైతుల రుణ సమస్యలను తీర్చేందుకు బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందులో 90 శాతం మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన చెందారు. సుమారు రూ.34కోట్లతో మండలవ్యాప్తంగా రహదారులు, మౌలిక వసతులు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. రానున్న పుష్కరాలకు రహదారుల విస్తరణ చేపట్టి నర్సరీలకు రవాణా ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. నూతనంగా కొలువుదీరిన పాలకవర్గం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





