
కోలీవుడ్ హీరో ధ్రువ్ విక్రమ్ టాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. వరుస ద్విభాషా చిత్రాలను లైన్లో పెట్టారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘DV4’ వర్కింగ్ టైటిల్‌తో ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను తాజాగా ప్రారంభించారు. దీని షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. డీఎంతో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ‘జాకీ - నో రీటేక్స్ అలౌడ్’ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ను కూడా ప్రకటించారు. తండ్రి విక్రమ్‌లాగే టాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు ధ్రువ్ సిద్ధమవుతున్నారు.




