
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Custard Apple Side Effects In Winter: ఎల్‌నినో పుణ్యమా అంటూ ఈ ఏడాది వర్షాలే కరువు అయ్యాయి. అయితే మరో నెల రోజుల్లో వర్షాకాలం ముగిసి శీతాకాలం రానుంది. శీతాకాలంలో లభించే అత్యంత రుచికరమైన, పోషకమైన పండ్లలో సీతాఫలం ఒకటి. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఈ పండును రోజూ తినడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే, దాని తీపి రుచి ఉన్నప్పటికీ, సీతాఫలాన్ని అధికంగా తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొందరు పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
సీతాఫలం అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణాశయ సమస్యలు..కడుపు ఉబ్బరం.. అందులో మొదటిది జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి ఎదురుకావొచ్చు. సీతాఫలంలో పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మంచిగా జరిగినా.. ఒకేసారి పండును అతిగా తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, తీవ్రమైన కడుపునొప్పి లేదా విరేచనాలు కలగొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
నాడీ వ్యవస్థ రుగ్మతలు - అనోనాసిన్ విషం.. సీతాఫలంలో 'అనోనాసిన్' అనే సహజమైన విషం పదార్థం ఉంటుందట. ఈ క్రమంలో సీతాఫలాన్ని ఎక్కువగా తినడం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుందట. నాడీ సంబంధిత రుగ్మతలు లేదా పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇప్పటికే మందులు వాడుతున్న వారు సీతాఫలాన్ని తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
సీతాఫలం గింజల విష ప్రభావాలు.. సీతాఫలం గింజలు తినేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. సీతాఫలం గింజలలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. పొరపాటున గింజలను నమలడం లేదా మింగడం వల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, కడుపు వాపు సంభవించవచ్చు. పిల్లలకు గింజలు ఇచ్చేటప్పుడు, వాటిని పూర్తిగా వేరు చేసి, కేవలం గుజ్జును మాత్రమే ఇవ్వాలని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం.. సీతాఫలంలో సహజ గ్లూకోజ్, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. మధుమేహం (షుగర్) ఉన్నవారు బాగా పండిన సీతాఫలాన్ని ఎక్కువగా తింటే, వారి రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
జలుబు, దగ్గు, ఆస్తమా తీవ్రత పెరగడం.. సీతాఫలానికి శరీర ఉష్ణోగ్రతను తగ్గించే గుణం ఉంది. ఇప్పటికే జలుబు, దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా లేదా సైనస్ సమస్యలతో బాధపడుతున్న వారు సీతాఫలాన్ని తింటే, శ్లేష్మం అధికంగా ఉత్పత్తి కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని ఆహార నిపుణులు వెల్లడించారు.
బరువు పెరగడం - చర్మ అలెర్జీలు.. వీటిలో కేలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ పండులోని ఎంజైమ్‌ల వల్ల కొంతమందికి చర్మంపై ఎర్రటి దద్దుర్లు, తీవ్రమైన దురద కలగవచ్చు.
ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు కొద్ది మొత్తంలో సీతాఫలం తినడం సురక్షితం. గర్భిణీ స్త్రీలు, మధుమేహం ఉన్నవారు, మూత్రపిండాలు లేదా నరాల సమస్యలతో బాధపడుతున్నవారు సీతాఫలం తినే ముందు తమ వైద్యుడిని సంప్రదించాలి.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం కొందరు పోషకాహార నిపుణుల సూచనల మేరకు పొందుపరిచినది. అధిక రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులు దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




