
వరుస సెలవుల నేపథ్యంలో మార్కాపురం (Markapuram) జిల్లా దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project)కు సందర్శకుల తాకిడి పెరిగింది. ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. గంటవానిపల్లె దగ్గర ఉన్న ప్రాజెక్టు ఫీడర్ కాలువలో ప్రవహిస్తున్న కృష్ణమ్మను చూసి పులకరించి పోతున్నారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ఈ వార్త చదివారా: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు: నాగబాబు






