
ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటన ఖరారైంది. ఈ రోజు (బుధవారం) ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరవ్వనున్న ఆయన.. అనంతరం అదే రోజు సాయంత్రం బ్రిటన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లనున్నారు. మొత్తం 11 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో అధికారికంగా పలు సమావేశాలు.. విశ్వ విద్యాలయా ల్లో భేటీలు జరగనున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 11 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ లో పార్టీ అత్యున్నత విధాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటున్నారు. ఆ తరువాత విదేశాలకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూకే, యూఎస్ లో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమై.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పలువురు ఉన్నతాధికారులు కూడా సీఎంతో పాటు వెళ్తున్నారు. 11 రోజుల పర్యటన అనంతరం ఈనెల 30న వారు హైదరాబాద్‌కు చేరుకుంటారు. యూకే పర్యటనలో భాగంగా ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ మరియు లండన్ యూనివర్సిటీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అలాగే, ప్రసిద్ధ బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను సందర్శించడంతో పాటు, ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ ప్రెజెంటేషన్‌కు హాజరవుతారు. 24-కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్దం: తెలుగు రాష్ట్రాలకు ఇలా, రూట్.. షెడ్యూల్..!!వరుస సమావేశాలు.. నిర్ణయాలుఈ నెల 23న ఆగస్టు 23న ఆయన అమెరికాకు పయనం కానున్నారు. అమెరికాలో హార్వర్డ్, ఎంఐటీ క్యాంపస్‌ల సందర్శన అమెరికాలో తన పర్యటనలో భాగంగా బోస్టన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ మరియు ఎంఐటీ క్యాంపస్‌లను సీఎం సందర్శిస్తారు. అంతేకాకుండా, నార్త్‌ఈస్టర్న్ మరియు వర్జీనియా టెక్ యూనివర్సిటీల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసే ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను కలుసుకుంటారు. ఈ విదేశీ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టంగా ఆగస్టు 27, 28 తేదీల్లో గ్లోబల్ సీఈవోలు, వెంచర్ క్యాపిటలిస్టులు మరియు బహుళజాతి సంస్థల అధిపతులతో పారిశ్రామిక రౌండ్‌టేబుల్ సమావేశాలు జరగనున్నాయి. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు మరియు మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా సీఎం ఈ చర్చలు నిర్వహించనున్నారు.





