

- ధరణి పేరుతో భూ అక్రమాలు
- కేసీఆర్ కుటుంబానికి 439 ఎకరాలు
- అసెంబ్లీలో రేవంత్ రెడ్డి లెక్కలు
CM Revanth Reddy: తెలంగాణ శాసనసభ వేదికగా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ అక్రమాలకు, భూ దందాలకు కేంద్రబిందువుగా మారిందని ఆయన ఆరోపించారు. టెరాసిస్ కంపెనీ ప్రవేశంతో వేల కోట్ల విలువైన 22ఏ భూములు అక్రమంగా బదిలీ అయ్యాయని, దీనిపై అసెంబ్లీలో చర్చించే ధైర్యం లేకనే బిఆర్ఎస్ నేతలు సభ నుండి వాకౌట్ చేశారని సీఎం విమర్శించారు.
cm chandrababu: ఏపీ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్.. మార్చి నాటికి 5.52 లక్షల ఇండ్లు.. చంద్రబాబు కీలక ఆదేశాలు!
ధరణి అక్రమాలు, భూముల బదిలీ:
హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని విలువైన భూములకు సంబంధించిన నక్షాలు కూడా సరిగ్గా లేవని, దీనివల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పోరాటయోధులు తమ భూములను సర్వస్వం కోల్పోతే, ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్ మాత్రం వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములను అక్రమంగా సంపాదించుకున్నారని సభలో లెక్కలతో సహా వివరించారు.
కేసీఆర్ కుటుంబ భూముల లెక్కలు బహిర్గతం:
కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరిట మొత్తం 439 ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్, ఆయన సతీమణి పేరిట 65 ఎకరాలు, కేటీఆర్ పేరిట 49 ఎకరాలు, హిమాన్షు పేరిట 46.3 ఎకరాలు, కవిత, అనిల్, హరీష్ రావు కుటుంబ సభ్యుల పేరిట భారీగా భూములు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే సంతోష్ కుమార్, జోగినపల్లి రవీందర్ రావు కుటుంబానికి 79 ఎకరాలు, ఎమ్మెల్సీ నవీన్ రావుకు 97 ఎకరాలు ఉన్నాయని వెల్లడించారు.