
BCCI Chief Selector: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీకాలం త్వరలోనే ముగియనుంది. అక్టోబర్ 4తో ఆయన పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని పొడగిస్తారా లేదా అనే దాని పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఒకసారి పొడిగింపులో ఉన్న అగార్కర్‌ను ఇకపై కొనసాగించే అవకాశం లేదని క్రికెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని, కొత్త చీఫ్ సెలక్టర్‌ను ఇప్పుడే ఎంపిక చేయడం సరైన నిర్ణయమని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం జరగనున్న బీసీసీఐ యాన్యువల్ జనరల్ మీటింగులో(AGM) దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.




