
బుధ, రవి, శుక్ర, కుజ గ్రహాల రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వారు అక్టోబర్ 15 లోగా ఉద్యోగం మారడం, ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకోవడం, బదిలీ కావడం, కొత్త బాధ్యతలు చేపట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారడమనేది లాభదాయకంగా, యోగదాయకంగా ఉండే అవకాశం ఉంది. వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల వారు ఉద్యోగం మారే ప్రయత్నాలు చేపట్టడానికి ఈ నెల రోజుల సమయం బాగా అనుకూలంగా ఉంది. వీరికి ఈ నెల(సెప్టెంబర్) 15 నుంచి వచ్చే నెల ద్వితీయార్థం వరకు కొత్త ఆఫర్లు, అవకాశాలు అందే అవకాశం కూడా ఉంది.




