
ఈనాడు, అమరావతి: వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశించారు. మలేరియా, డెంగీ, స్క్రబ్‌ టైఫస్, టైపాయిడ్‌ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘‘ఆయా కేసుల రిపోర్టింగ్‌కు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దోమల నియంత్రణలో భాగంగా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి. గిరిజన ప్రాంతాల్లో దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి’’ అన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



