

- బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా?
- బరోడా బ్యాంకులో 1,100 పోస్టులు, సెప్టెంబర్ 24 చివరి గడువు
- డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగం.. నెలకు రూ.93,960 వరకు జీతం
- వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు, వెంటనే అప్లై చేయండి
Bank of Baroda Recruitment 2026 : బ్యాంకు జాబ్ కోసం చూస్తున్నారా? బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్ పడ్డాయి. ఈ బ్యాంకులోని వివిధ విభాగాల్లో మొత్తం 1,100 రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 24 వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.93,960 వరకు జీతం పొందవచ్చు.
ఈ నియామకంలో ప్రధానంగా 2 రకాల పోస్టులు ఉన్నాయి. వెల్త్ ఎగ్జిక్యూటివ్ (JMG/S-I)కు 1,000 పోస్టులు, క్రెడిట్ అనలిస్ట్ (MMG/S-II)కు 100 పోస్టులు ఉన్నాయి. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
విద్యార్హతలివే :
వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత సర్టిఫికేషన్‌తో పాటు వెల్త్ ప్రొడక్ట్స్ సేల్స్ విభాగంలోనూ కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ మాత్రమే కాదు.. మేనేజ్మెంట్లో రెండేళ్ల ఫుల్‌టైమ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా, MBA ఏదొకటి చేసి ఉండాలి. - బరోడా బ్యాంకులో 1,100 పోస్టులు, సెప్టెంబర్ 24 చివరి గడువు




