
Donald Trump : అమెరికాలో మధ్యంతర ఎన్నికలు (US Elections) దగ్గరపడుతున్న వేళ దేశీయంగా డీజిల్ (Diesel), గ్యాసోలిన్ (Gasoline) ధరలు ఆకాశాన్ని తాకడం అక్కడి రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation), ఇంధన ధరల (Fuel price) భారాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా (Russia) లోని చమురు రిఫైనరీలపై వరుస డ్రోన్ దాడులు (Drone Attacks) చేయడం తక్షణమే నిలిపివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine President) వ్లాదిమిర్ జెలెన్స్కీ (Valodimir zelensky) ని ఆయన ఆదేశించారు. అంతర్జాతీయ కథనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్ జరుపుతున్న ఈ దాడుల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని, గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు రికార్డుస్థాయికి చేరుతున్నాయి. ఇది కాస్తా అమెరికాలో డీజిల్, పెట్రోల్ ధరల తీవ్ర పెరుగుదలకు కారణమవుతోందని ట్రంప్ యంత్రాంగం భావిస్తున్నది. ఎన్నికల వేళ ఈ ఇంధన ధరల ప్రభావం తమ ఓటు బ్యాంకుపై పడకుండా ఉండేందుకు, ఉక్రెయిన్‌కు ఇచ్చే సైనిక సహాయాన్ని ఆసరాగా చేసుకుని దాడులను కట్టడి చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా అవలంబిస్తున్న దౌత్య వ్యూహాలపై సరికొత్త చర్చకు దారితీసింది.





