
Apple iOS 27 | ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఐఓఎస్‌ 27’ (iOS 27)ను యాపిల్ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు, సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్, మెరుగైన భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ అప్‌డేట్‌ను భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన WWDC 2026లో దీనిని యూజర్లకు తొలిసారి పరిచయం చేసింది. డ్యుయో, 18ప్రో ఫోన్లు ఈ ఓఎస్‌తోనే వస్తున్నాయని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. కొత్త ఓఎస్‌ను అప్‌డేట్ చేసేముందు.. కీలకమైన సమాచారాన్ని బ్యాకప్ చేసుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఛార్జింగ్ కూడా తగినంత ఉండాలని చెప్తున్నారు. అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు దానిని నేరుగా ఐఫోన్ నుంచే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. NSE IPO దశాబ్దకాలం పాటు ఎందుకు వాయిదా పడింది? కొత్తగా విడుదలైన మోడళ్లతో పాటు ఐఫోన్‌ 11 నుంచి ఐఫోన్ 17 సిరీస్ వరకు ఫోన్లలో దీనిని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఐఫోన్ ఎస్‌ఈ రెండు, మూడు జనరేషన్లకు ఈ అప్‌డేట్‌ వస్తుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





