
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈనాడు, అమరావతి: మెగా డీఎస్సీలో 16 వేల ఉపాధ్యాయ పోస్టుల్ని వంద శాతం పారదర్శకతతో భర్తీ చేసినట్టు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్సీపై వైకాపా అధినేత జగన్, ఆ పార్టీ నాయకుల విమర్శలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు. అభ్యర్థుల ధ్రువపత్రాల్ని క్షుణ్ణంగా పరీక్షించాకే క్రీడాకోటా నియామకాలు జరిగాయని ఆదివారం ఓ ప్రకటనలో వివరించారు. గత వైకాపా ప్రభుత్వంలో ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అవకతవకల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





