
అల్లూరి సీతారామరాజు జిల్లా: డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లో భారీ శబ్దంతో తుపాకీ పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ ఎస్ఐ సత్యనారాయణ.. AK-47తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన ఛాతికి బుల్లెట్ గాయాలు కావడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.





