
సాతాపూర్‌: ఇసుకను ట్రాక్టర్‌లో నింపుతున్నారిలా.. పెద్దకొత్తపల్లి న్యూస్‌టుడే: నల్లమల ప్రాంతంలో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నా, పట్టించుకునేవారే కరవయ్యారు. దీంతో అక్రమ దందాలు చేసేవారికి ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తోంది. నాణ్యమైన ఇసుక లభించక ఫిల్టర్‌ దందాకు తెర లేపారు. జాతీయ రహదారి పొడవునా నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిపోతున్నా రెవెన్యూ, జీపీవోలు, పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఇసుక వ్యాపారాలు సాగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు ఆయా మండలాల రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు ఇస్తాం. ఫిల్టర్‌ ఇసుక తయారు చేయకుండా చూస్తాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





