
జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టాలు తప్పవు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి సమాచారం అనకాపల్లి, అనంతగిరి, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్‌ పాతది అయిందనో, కిందపడి పగిలిందనో, నీటిలో పడి పాడైందనో ఎంతో కొంతకు ఇచ్చేసి కొత్త ఫోన్‌ తీసుకుంటాం. చాలా మంది ఏడాది గడవక ముందే ఫోన్లు మార్చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కొంతమంది పాత ఫోన్లకు మంచి ధర ఇస్తామంటూ మైకు ప్రచారం చేస్తూ వీధుల్లో తిరుగుతున్నారు. ఇలా వచ్చే వారిని గుడ్డిగా నమ్మేసి పాత ఫోన్‌ అమ్మేస్తే తర్వాత కష్టాలను కొనితెచ్చుకున్నట్లే. పాత ఫోన్లకు ప్లాస్టిక్‌ సామగ్రి/ నగదు ఇస్తామని ఇంటింటికీ తిరిగే వారికి తెలియకుండానే వారి వెనుక సైబర్‌ నేరగాళ్ల హస్తం ఉండొచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





