
ఆదిలాబాద్ కలెక్టరేట్: పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన దత్తు - సునీత దంపతుల పెద్ద కుమార్తె ప్రాప్తి ఎంబీబీఎస్‌లో సీటు సాధించారు. అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ తన కుమార్తెను చదివించిన విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ స్వాతి మంగేష్ దేవతాడే దంపతులు.. వారిని శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ప్రాప్తి నేటి తరానికి ఆదర్శం అని కౌన్సిలర్‌ దంపతులు కొనియాడారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





