
న్యూఢిల్లీ: పెద్దలు, ప్రముఖులు, సామాన్యులు.. ఎవరు ఎదురైనా గౌరవంగా పలకరించడం గొప్ప సంస్కారానికి నిదర్శనంగా భావిస్తారు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనను సురక్షితంగా తీసుకువచ్చిన డ్రైవర్ను ప్రత్యేకంగా పలకరించి, కరచాలనం చేసి వెళ్లిన ఆయన తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.





