
భువనగిరి: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు యాదాద్రి భువనగిరి జిల్లా ముస్తాబైంది. గ్రామగ్రామాన.. వాడవాడనా వివిధ సంఘాలు, యువజన కమిటీలు గణనాథుల ప్రతిష్టకు ఏర్పాట్లు చేశారు. కాషాయ జెండాలు, రంగురంగుల విద్యుత్‌ దీపాలతో మండపాలను ఆకర్షణీయంగా అలంకరించారు. దీంతో జిల్లాలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. జిల్లాలో చిన్నా, పెద్దా కలిపి సుమారు 2వేల విగ్రహాలను ప్రతిష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ ఆకృతుల్లోని విగ్రహాలను ఇప్పటికే తరలించగా.. పూజా సామగ్రి, అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. తొమ్మిది రోజులపాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలువురు నిర్వాహకులు మట్టి, గడ్డి, సహజసిద్ధమైన రంగులతో తయారు చేసిన విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణహితంగా ఉత్సవాలు నిర్వహించాలని గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు పసుపునూరి నాగభూషణం కోరారు. విగ్రహాలను ప్రతిష్టించేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ వెల్లడించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





