
స్మార్ట్‌వాచ్ పెట్టుకుంటే హార్ట్ రేట్, స్టెప్స్, నిద్ర వంటి వివరాలు తెలుసుకోవచ్చు. కానీ మెదడులో రక్త ప్రసరణ ఎలా మారుతుందో తెలుసుకోవాలంటే ఇప్పటివరకు ప్రత్యేక వైద్య పరికరాలు అవసరమయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చే లక్ష్యంతో Temple అనే చిన్న వేరబుల్ ముందుకొచ్చింది. దీపిందర్ గోయల్ చెబుతున్న ఈ టెక్నాలజీపై తాజాగా ఆసక్తికరమైన పరిశోధన జరిగింది.






