హనుమాన్ 3 అద్భుతం.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది
Actor ProfileActor

హనుమాన్ 3 అద్భుతం.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హనుమాన్ 3 అద్భుతం.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది
AP7AM26 Jun 2026
హనుమాన్ 3 అద్భుతం.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది

సూపర్ హీరో తేజ సజ్జ, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ఈ ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 'హనుమాన్'. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌, ఇప్పుడు సరికొత్త 3D అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది. జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా 3Dలో విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం హైదరాబాద్‌లో 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ, "హనుమాన్ 3D ట్రైలర్ అద్భుతంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కొత్త టెక్నాలజీతో మంచి సినిమా అందించాలనే నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిల ప్యాషన్‌ను అభినందిస్తున్నాను. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. హనుమంతుడిని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. జూన్ 25న అందరూ కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి ఈ అద్భుతమైన అనుభూతిని పొందండి" అని కోరారు.హీరో తేజ సజ్జ మాట్లాడుతూ, "నేను కూడా మీతో పాటే మొదటిసారి 3D ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా కోసం నిర్మాతలు పడిన కష్టం తెరపై కనిపిస్తోంది. మీ అందరిలాగే నేను కూడా 3Dలో సినిమాను మళ్లీ థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రాదు. ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలకు నా