
భారీ స్టార్స్‌ను పెట్టి సినిమాలు తీసే క్రమంలో నిర్మాణ వ్యయం అమాంతం పెరిగిపోతోందని, ఇది ప్రొడ్యూసర్లకు పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ ఇండస్ట్రీలో చాలా కాలంగా నడుస్తోంది. ఇదే వ్యవహారంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) ఒక తాజా పాడ్ క్యాస్ట్ వెల్లడించిన అభిప్రాయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారీ స్టార్స్‌ను పెట్టి సినిమాలు తీసే క్రమంలో నిర్మాణ వ్యయం అమాంతం పెరిగిపోతోందని, ఇది ప్రొడ్యూసర్లకు పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ ఇండస్ట్రీలో చాలా కాలంగా నడుస్తోంది. ఇదే వ్యవహారంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు (Dil Raju) ఒక తాజా పాడ్ క్యాస్ట్ వెల్లడించిన అభిప్రాయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చిత్రాల మార్కెట్ పరిధి, బిజినెస్ రేంజ్ గురించి తానే స్వయంగా హీరోలకు ముందే స్పష్టత ఇస్తానని, బడ్జెట్ పరిమితులను దాటి పారితోషికాలు ఇవ్వడం తన వల్ల కాదని, తన ఆలోచనలతో సింక్ అయ్యే హీరోలతోనే సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతానని దిల్‌రాజు కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశాడు. తమకున్న క్రేజ్, మార్కెట్ వాల్యూ ఎక్కడ పడిపోతుందో అనే భయంతోనే చాలామంది స్టార్స్ తమ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవడానికి వెనుకాడుతుంటారని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు. ప్రస్తుతం పరిశ్రమలో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. ఒక రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో దాదాపు 35 నుంచి 40 శాతం వరకు భారీ మొత్తాన్ని కేవలం ఒక హీరో పారితోషికానికే కేటాయించాల్సి రావడం మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారిందని దిల్‌రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అనుసరిస్తున్న సరికొత్త బిజినెస్ మోడల్‌ను ఉదాహరణగా చూపించాడు. హిందీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ముందస్తుగా పెద్ద మొత్తంలో క్యాష్ అడ్వాన్స్ రూపంలో తీసుకోవడం కంటే, సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే నికర లాభాల్లో వాటా తీసుకునేందుకు అక్కడి స్టార్స్ ఆసక్తి