
ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తన నవ్వు,నటన, గ్లామర్ తో ఊపు ఊపేసింది రోజా... తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకీ, శ్రీకాంత్, జగపతి బాబు.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. మరో వైపు తమిళంలో కూడా స్టార్ హీరోలకు జోడీగా అలరించింది రోజా. మూవీకెరీర్ కు గుడ్ బై చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజా.. పలు పార్టీలు మారి.. చివరికి వైసీపీలో మంత్రి స్థాయికి ఎదిగింది. పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా సెల్వమణి.. రీసెంట్ గా జరిగిన ఎన్ని కల్లో ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయింది. మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బుల్లితెరపైకి మళ్లీ వచ్చేసింది రోజా. ఓ డ్రామా జూనియర్స్ కు జడ్జిగా వ్యవహరిస్తుంది. రోజా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే తమిళ నిర్మాత సెల్వమణిని పెళ్లాడింది. వారికి ఇద్దరు పిల్లలు, అబ్బాయి, అమ్మాయి. ఇద్దరు ఫారెన్ లో చదువుకుంటున్నారు. అమెరికాలో చదువుతున్న రోజా కూతురు అన్షు మాలికపై ప్రస్తుతం అందరి కళ్లు పడ్డాయి. ఆమె రోజాను మించిన అందంతో.. హీరోయిన్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. కానీ అన్షు మాత్రం ప్రస్తుంతం చదువులో రికార్డులు సృష్టిస్తోంది. రీసెంట్ గా ఇండియానా యూనివర్సిటీలో అత్యంత ప్రెస్టేజియస్ గా భావించే “హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్ అవార్డు” అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా అన్షు మాలిక గుర్తింపు పొందింది. అన్షు మాలిక ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో లడ్డి స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటింగ్ అండ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో చదువుతోంది. అన్షు మాలిక ఇది మాత్రమే కాదు.. చాలా ఘనతలను సాధించింది. తను చదువకుంటున్న రోజుల్లో పలు ప్రెస్టేజియస్ అవార్డులను కూడా అందుకుంది. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ, లడ్డి అకాడెమిక్ ఎక్సలెన్స్