
తెలుగులో పదుల సంఖ్యలో ఆల్బమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దారిపొంటొత్తుండు, పెద్దిరెడ్డి, నా పేరు ఎల్లమ్మ లాంటి హిట్ సాంగ్స్ మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అయితే తెలుగులో 'కలివనం' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది గానీ ఇదొకటి రిలీజైందనే సంగతి కూడా చాలామందికి తెలియదు! ఇప్పుడు తమిళంలో ఎంట్రీకి సిద్ధమైంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట) స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలోనే నాగదుర్గనే మెయిన్ హీరోయిన్. 'లవ్ ఓ లవ్' పేరుతో తీస్తున్న ఈ సినిమాని వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే హీరోయిన్ పాత్రకు బాగానే ఇంపార్టెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రియుడితో ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టించే మోడ్రన్ అమ్మాయిగా నాగదుర్గ కనిపించనుంది. ఈ మూవీ హిట్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు. ఇప్పటికే తమిళంలో గౌరిప్రియ, శ్రీదివ్య లాంటి తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాగదుర్గ, వైష్ణవి చైతన్య లాంటి వాళ్లు కూడా తమిళంలోకి వెళ్లిపోతున్నారు. మరి తమిళంలో వీళ్లకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగు దర్శకులు మాత్రం వీళ్లని పెద్దగా పట్టించుకోవట్లేదా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది) హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు) ‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు) 'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు) ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు) ‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు 22 ఏళ్లకే ఫేమస్.. ఎవరూ ఊహించని విధంగా మృతి చిన్నారి కేసులో ఏం జరిగింది.. పాయింట్