హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో
Actor ProfileActor

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో, ఏడుగురు దుర్మరణం
Vaartha18 Jun 2026
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో, ఏడుగురు దుర్మరణం

Himachal Pradesh Road Accident: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. మస్రుంద్-హమల్ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద వార్త స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. Read also: Sanchita Ugale: సుశాంత్ వర్ధంతి రోజే నటి సంచిత ఆత్మహత్య.. సోదరుడి సంచలన ఆరోపణలు పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. మృతులలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరంతా ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారికి ముండన్ (తలనీలాలు సమర్పించే) వేడుకను ముగించుకుని సొంత ఊరికి వస్తుండగా కాలయముడు రోడ్డు ప్రమాదం రూపంలో విరుచుకుపడ్డాడు. ప్రమాదానికి గురైన బొలెరో వాహనం కుథేడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని మహల్ గ్రామానికి చెందినదిగా అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. లోయ చాలా లోతుగా ఉండటంతో మృతదేహాలను బయటకు తీయడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వాహనం అదుపు తప్పడానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Nagpur Forced Conversion Case: ఐఏఎఫ్ అధికారి భార్య కేసు.. మరో నిందితుడి అరెస్ట్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Petrol, Diesel Price Today: దేశవ్యాప్తంగా స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు Dharmasthala Controversy: ధర్మస్థల వివాదంలో నా ప్రమేయం లేదు: ప్రకాశ్ రాజ్ Versova Beach : బీచ్ నే పడక గదిగా మార్చుకున్న