హైప్ పెంచేలా లెనిన్ ట్రైల ర్
Actor ProfileActor

హైప్ పెంచేలా లెనిన్ ట్రైల ర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైప్ పెంచేలా లెనిన్ ట్రైల ర్
Telugu Times25 Aug 2026
హైప్ పెంచేలా లెనిన్ ట్రైల ర్

అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా తెరకెక్కుతున్న లెనిన్(Lenin) సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. డైరెక్ట‌ర్ మురళీ కిషోర్ అబ్బూరి(Murali Kishore Abburi) రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అఖిల్ గత సినిమాల‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించాడు. ట్రైలర్ ప్రారంభం నుంచే ఇంటెన్స్ యాక్షన్, బలమైన భావోద్వేగాలు, స్టైలిష్ విజువల్స్‌తో కథలోని ప్రధాన సంఘర్షణను పరిచయం చేశారు. ప్రేమ, ప్రతీకారం, పోరాటం చుట్టూ కథ తిరుగుతుందనే సంకేతాలను ఇస్తూనే, సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ట్రైలర్‌ను కట్ చేశారు. అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన తీవ్రత, పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. భారీ యాక్షన్ బ్లాక్స్‌కు తోడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చింది. కమర్షియల్ అంశాలతో పాటు ప్రేమకథ, భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అఖిల్‌కు ఇది కీలకమైన సినిమా అవుతుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో పలువురు ప్రముఖులు కనిమ‌పించనున్నారు. నిర్మాణ విలువలు, విజువల్ ట్రీట్, యాక్షన్ డిజైన్ ట్రైలర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. అక్కినేని నాగార్జున(AKkineni Nagarjuna), నాగవంశీ(Naga Vamsi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచడంతో బాక్సాఫీస్ వద్ద అఖిల్‌కు ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందిస్తుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది