హైదరాబాద్ లో వర్షం.. మరో రెండు గంటల్లో
Actor ProfileCelebrity

హైదరాబాద్ లో వర్షం.. మరో రెండు గంటల్లో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లో వర్షం.. మరో రెండు గంటల్లో
Sakshi21 Jun 2026
హైదరాబాద్ లో వర్షం.. మరో రెండు గంటల్లో

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో, వాతావరణం చల్లబడింది. కాగా, తెలంగాణలో రానున్న రెండు గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మేడ్చల్‌, సిద్దిపేట, యాదాద్రి, కరీంనగర్‌, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట సహ పలు జిల్లాలో మోస్తరు నుంచి కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు.. రానున్న మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను జారీ చేసింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మచిలీపట్నం, ఏలూరు, నర్సాపూరం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు హెచ్చరిక.. అలాగే, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌తో పాటుగా పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించింది. మెరుపు తీగలా కాజల్.. విషెస్ చెప్పినోళ్లకు థ్యాంక్స్ (ఫొటోలు) చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తున్న భాగ్యశ్రీ (ఫొటోలు) ‘నాగబంధం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌లో మెరిసిన నభా నటేష్ (ఫొటోలు) పరేడ్‌ గ్రౌండ్స్‌లో యోగా డే వేడుకలు.. ప్రముఖుల ఆసనాలు (ఫొటోలు) నేను స్టేషన్ కి రాను.. వస్తే మీ బండారం బయటపెడతా! Missing Case: చిన్నారి ఆచూకీ చెప్తే లక్ష రూపాయలు జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. ఆ 15 నిమిషాలు ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. శ్మశాన వాటికలో పోలీసుల విచారణ వినుకొండలో ఉద్రిక్తత.. బ్రహ్మనాయుడుని అడ్డుకున్న ఖాకీలు