
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Married woman perform witchcraft rituals in hyderabad: ఇటీవల ఎక్కడ చూసిన కొంత మంది భార్యభర్తలు చక్కగా పెళ్లిళ్లు చేసుకుని వివాహేతర సంబంధాలకు తెరతీస్తున్నారు. మరి వీరి బుద్ది పెళ్లి తర్వాత ఎందుకు నీచంగా మారుతుందో అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రతిరోజు భార్యభర్తలు ఒకర్ని మరోకరు హత్యలు చేసుకొవడంకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల భార్య తన భర్తను చంపితే, మరికొన్ని చోట్ల భర్త తన భార్యను పొట్టన పెట్టుకుంటున్నాడు. చాలా చోట్ల వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ లో ఒక మహిళ తన భర్త వివాహేతర సంబంధంపై ఏకంగా గుడిలో వెరైటీ పూజలు చేయడం వార్తలలో నిలిచింది. హైదరాబాద్ లోని సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్తకు వేరే మహిళతో ఉన్న వివాహేతర సంబంధం తెగిపోవాలని ప్రత్యేక పూజలు చేసింది. ఆమె గుడిలో భర్తతో పాటు, మరో యువతి ఫోటోలు తీసుకుని వచ్చింది. ఏవేవొ మంత్రాలు చదువుతూ చాలా వింతగా ప్రవర్తించింది. ఆ ఫోటోలపై పసుపు, కుంకుమలు వేస్తు వింత పనులు చేసింది. ఆమె చేస్తున్న నిర్వాకం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. మొత్తంగా ఇదేదో తాంత్రిక పూజలా ఉందని వెంటనే ఆలయ సిబ్బందికి చెప్పారు. వెంటనే అక్కడకు చేరుకున్నసిబ్బంది మహిళను మందలించి అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ క్రమంలో కొంత మంది మహిళ పూజల్ని సీక్రెట్ గా పూజలు చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్