హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన
Actor ProfilePolitician

హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన

Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన
Eenadu14 Jun 2026
హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాక్రోచ్‌ జనతా పార్టీ.. హైదరాబాద్‌లో నిరసన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలోని అవకతవకలను నిరసిస్తూ ధర్నాచౌక్‌ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించింది. పర్యావరణవేత్త, ఉద్యమ నేత సోనమ్‌ వాంగ్‌చుక్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి తదితరులతోపాటు యువత పెద్దఎత్తున పాల్గొంది. నీట్‌ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎంతో సంపద ఉంది. అదంతా ఎక్కడికి వెళ్తోంది? దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఎందుకు నెలకొంది? యువతను కాక్రోచ్‌లుగా పేర్కొనడం ఏంటి? దేశంలో ఆరు శాతం మంది యువతకు మాత్రమే నైపుణ్యాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి మిగతావారికి అవి ఎందుకు అందటం లేదు? విద్యార్థులకు అన్యాయం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆయన్ను జైలుకు పంపాలి’’ అని డిమాండ్‌ చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వచ్చే నెల నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు?