
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tesla: ప్రపంచ కుబేరుడు అయిన ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా హైదరాబాద్ లో గ్రాండ్ గా అడుగుపెట్టింది. ఇండియాలో టెస్లాకు ఇది 5వ ఎక్స్పీరియన్స్ సెంటర్ కాగా సేల్ సర్వీస్లను హైటెక్ సిటీలో అధికారికంగా ప్రారంభించింది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత్లో తన విస్తరణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, గురుగ్రాం బెంగళూర్లో ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసిన టెస్లా హైదరాబాద్ లోని నాలెడ్జ్ సిటీలో కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ప్రారంభించింది. దీంతో దేశంలో టెస్లా కి ఇది ఐదవ ఎక్స్పీరియన్స్ సెంటర్. హైదరాబాద్ ను టెస్లా ఎంపిక చేసుకోవడం వెనుక నగరంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బలమైన ఐటి ఎకోసిస్టం అధిక ఆదాయ వర్గాలు కొనుగోలు శక్తి ప్రధాన కారణాలుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో టెస్ల కేవలం మోడల్ వై ఎలక్ట్రిక్ఎస్v ని మాత్రమే విక్రయిస్తోంది. దీని ధర సుమారు 50.89 లక్షల నుంచి ప్రారంభం అవుతూ ఉండగా 6క్స్ సీటర్ మోడల్వైఎల్ ప్రీమియం AW ధర 61.99 99 లక్షల వరకు ఉంది. అధిక దిగుమతి సుంకాలు ఉన్నప్పటికీ లగ్జరీ ఈవ విభాగంలో టెస్లా తన స్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్లో టెస్లా మార్కెట్ ప్రధానంగా ఐటి ఉద్యోగులు స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు హై నెట్వర్క్ వ్యక్తులపై ఆధారపడే అవకాశం ఉంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజార్ హిల్స్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ప్రీమియం కార్లకు మంచి డిమాండ్ ఉంది. అదే వర్గం ఇప్పుడు ఎలక్ట్రిక్ లగ్జరీ కార్ల