హైదరాబాద్ మణికొండలో ఈగల్ టీమ్ ఆకస్మిక దాడులు
Actor ProfileActor

హైదరాబాద్ మణికొండలో ఈగల్ టీమ్ ఆకస్మిక దాడులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ మణికొండలో ఈగల్ టీమ్ ఆకస్మిక దాడులు
Andhra Jyothy26 Aug 2026
హైదరాబాద్ మణికొండలో ఈగల్ టీమ్ ఆకస్మిక దాడులు

హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని మణికొండలో మాదకద్రవ్యాల నిరోధక విభాగానికి చెందిన 'ఈగల్ టీమ్' ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన ఒక వ్యక్తిని హాష్ ఆయిల్ విక్రయిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మణికొండ(హైదరాబాద్) జూలై 1: హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని మణికొండలో మాదకద్రవ్యాల నిరోధక విభాగానికి చెందిన 'ఈగల్ టీమ్' (Eagle Team) ఈ ఉదయం ( బుధవారం) ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన వ్యక్తిని హాష్ ఆయిల్ (Hash Oil) విక్రయిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు మణికొండ పరిధిలోని సదరు ప్రైవేట్ హోటల్‌పై ఈగల్ టీమ్ సభ్యులు ఒక్కసారిగా మెరుపు దాడులు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. నిందితుడి నుంచి 9 గ్రాముల లీక్విడ్ హాష్ ఆయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడితో పాటు సీజ్ చేసిన హాష్ ఆయిల్‌ను స్థానిక నార్సింగి పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ వ్యక్తి డ్రగ్స్ విక్రేతా? లేక ఏజెంటా? అనే కోణంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హాష్ ఆయిల్ ఎక్కడి నుంచి నగరానికి తీసుకొచ్చారు? దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? ఐటీ కారిడార్‌లోని ఎవరెవరికి దీనిని సరఫరా చేస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు నిందితుడిని ముమ్మరంగా విచారిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు నిఘా మరింత కఠినతరం చేసినట్లు అధికారులు తెలిపారు. ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్‌: తుమ్మల హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!