హైదరాబాద్ మెట్రో స్వాధీనం
Actor ProfilePolitician

హైదరాబాద్ మెట్రో స్వాధీనం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
రేవంత్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, హైదరాబాద్ కు భారీ వరం
Oneindia Telugu6 Jul 2026
రేవంత్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, హైదరాబాద్ కు భారీ వరం

ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ నిర్వహించిన వరుస చర్చలు ఫలించాయి. దీంతో, మెట్రో పైన కీలక అడుగు పడింది. హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రో స్వాధీనం, విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు సఫలం
Andhra Jyothy6 Jul 2026
హైదరాబాద్ మెట్రో స్వాధీనం, విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు సఫలం

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి.. కేంద్రమంత్రులతో జరిపిన వరుస సమావేశాలు విజయవంతమయ్యాయి. హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు (Hyderabad Metro Expansion) భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy).. కేంద్రమంత్రులతో జరిపిన వరుస సమావేశాలు విజయవంతమయ్యాయి. మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, అలాగే ఫేజ్-2 విస్తరణ పనుల్లో ఉన్న అన్ని ప్రధాన ఆటంకాలు ఈ చర్చలతో తొలగిపోయాయి. ఈరోజు (మంగళవారం) ఉదయం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు ఉన్నతస్థాయి సంయుక్త సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్ (రైల్వే శాఖ), జి. కిషన్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మెట్రో విస్తరణ, నిధుల సమీకరణ, కేంద్ర-రాష్ట్ర ఉమ్మడి భాగస్వామ్యంపై ఈ సమావేశంలో అందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్‌గా 'SBICAPS' ఎంపిక.. విధివిధానాలు ఇవే.. మెట్రో ప్రాజెక్టును ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిష్ఠాత్మక ఆర్థిక సలహా సంస్థను 'SBICAPS' (SBI Capital Markets) కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. ఈ సంస్థ ప్రధాన అంశాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఫేజ్-1 వాల్యూయేషన్: ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన అప్పులు, ఈక్విటీ విలువ (వాల్యూయేషన్) రుణ సేకరణపై SBICAPS రోడ్ మ్యాప్ తయారు చేస్తుంది. ఫేజ్-2 నివేదిక: ఫేజ్-2 కింద ప్రతిపాదించిన కారిడార్ల నిర్మాణ వ్యయం ఎంత అవుతుంది? నిధుల కోసం ఏయే అంతర్జాతీయ రుణ సంస్థలను ఎంచుకోవాలి? అనే