.webp)
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులు, ఐఆర్ఎఫ్సీ రుణ నిధుల విడుదలలో మరింత జాప్యం చేయవద్దని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ అంశంపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్1 మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పెరిగిన జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2 ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. మొత్తం ఏడు కారిడార్లు, 122.9 కిలోమీటర్ల మార్గం, సుమారు 38 వేల 595 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఫేజ్ 1 ప్రైవేటు నిర్వహణలో ఉండటం, ఫేజ్ 2 వేరే సంస్థాగత విధానంలో అమలు చేయటంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపిన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించిందనీ, మొత్తం మెట్రో వ్యవస్థ ఒకే నెట్ వర్క్‌లో నడిచేందుకు వీలుగా ఫేజ్ 1ను స్వాధీనం చేసుకునే అసాధారణ నిర్ణయం తీసుకుందానీ ఆ లేఖలో వివరించారు. ఫేజ్ 1 స్వాధీనం ప్రక్రియలో ఈక్విటీ కొనుగోలుకు రూ. 1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు 13 వేల 538.53 కోట్లు కలిపి మొత్తం 15 వేల కోట్ల లావాదేవీలున్నాయి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పారదర్శకంగా నిర్వహించింది. ఈ కమిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున యూపీఎంఆర్సీఎల్ ఎండీ సుశీల్‌కుమార్‌ను సభ్యుడిగా నామినేట్ చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఐఆర్ఎఫ్సీ ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించి, డ్యూ డిలిజెన్స్ పూర్తి చేసి రుణ మంజూరు ఒప్పందం చేసిందనీ, రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చిందనీ వివరించిన రేవంత్ రెడ్డి.. ఐఆర్ఎఫ్సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల విడుదలకు