
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Indian Railway Finance Corporation: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13వేల 600 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. లార్సన్ అండ్ టూబ్రో సంస్థనుంచి హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు బాధ్యతలను తెలంగాణ సర్కారు తీసుకుంది. మెట్రోరైల్ మొదటి దశను ఏప్రిల్ 29వ తేదీన L&T (ఎల్‌అండ్‌టీ) నుంచి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 1,461 కోట్ల రూపాయల ఈక్విటీ చెల్లించి వంద శాతం షేర్లను కొనుగోలు చేసింది. అప్పటి వరకు మెట్రోరైల్ ప్రాజెక్టుపై ఉన్న 13 వేల 538కోట్ల అప్పును ప్రభుత్వంపై బదలాయింపు చేసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తర్వాత... మెట్రో రైల్ ప్రాజెక్టు రుణానికి చెల్లించే వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయని గుర్తించిన సర్కార్ రుణాలను రీ షెడ్యూల్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీంతో అధికార యంత్రాంగం ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వం ముందు ఉంచారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుకోసం ప్రతిపాదిత రుణాన్ని ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. కోరిన విధంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మే నెలాఖరు నాటికి రుణం మంజూరు చేస్తే... జూన్ ఒకటో తేదీ నుంచి మెట్రో మొదటిదశ ప్రభుత్వానికి యాజమాన్య హక్కు వస్తుందని, వడ్డీ చెల్లింపుల్లో ఆర్థిక భారం తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఇందుకు తగ్గట్టుగా రుణ