
హైదరాబాద్: హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ స్పిన్నర్ ప్రణవ్ వర్మ తన తొలి ఓవర్‌లోనే వికెట్ సాధించాడు. అతను వేసిన 4.3 ఓవర్‌కు విఘ్నేశ్ రెడ్డి (30); 17 బంతుల్లో) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 34 పరుగుల వద్ద పాలమూరు తొలి వికెట్ కోల్పోయింది. చైతన్య రెడ్డి (5) ఔటయ్యాడు. యశ్వీర్ గౌడ్ బౌలింగ్‌లో (3.1 ఓవర్) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 4 ఓవర్లకు పాలమూరు స్కోరు 38/1. విఘ్నేశ్ రెడ్డి (30), ప్రజ్ఞయ్ రెడ్డి (1) క్రీజులో ఉన్నారు. టీజీ20 లీగ్ (TG20 League) 2026లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మరికాసేపట్లో ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (Hyderabad E Champions), పాలమూరు స్ట్రైకర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ పోరులో గెలిచి విజయంతో టోర్నీని ఆరంభించాలని హైదరాబాద్ పట్టుదలతో ఉంది. మరోవైపు, ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడి ఖమ్మం చేతిలో ఓటమిపాలైన పాలమూరు.. పుంజుకోవాలని చూస్తోంది. హైదరాబాద్ తుది జట్టు: అభిరథ్ రెడ్డి (కెప్టెన్), అజయ్‌దేవ్ గౌడ్, ప్రణవ్ వర్మ, అరవింద్, సాయివికాస్ రెడ్డి, శ్రీనికేత్, షణ్ముఖ మురుగన్, యశ్వీర్ గౌడ్, అఖిల్ రాథోడ్, గణేశ్ గడుగు, అన్విత్. పాలమూరు తుది జట్టు: ప్రజ్ఞయ్ రెడ్డి (కెప్టెన్), విఘ్నేశ్ రెడ్డి, చైతన్య రెడ్డి, రోహిత్ రాయుడు, మహ్మద్ అఫ్రిది అహ్మద్, ప్రతీక్ పవార్, నిశాంత్ సేన్ రెడ్డి, రిషభ్ బస్లాస్, నిపుణ్ రెడ్డి, రవి కిరణ్, జంబోజు పార్థిపన్. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు