
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Deputy cm Pawan kalyan flies to Mumbai kokilaben hospital: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తరచుగా అస్వస్థతకు గురౌతున్నారు. కొన్ని నెలల క్రితం ఆయనకు సైనస్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత బ్యాక్ పెయిన్ సమస్యలతో కూడా సతమతమౌతున్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశంలో ఉండగా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సమావేశం మధ్యలోనే లేచి బైటకు వచ్చేశారు. విపరీతమైన డిస్క్ పెయిన్ తో తన కార్యాలయంకు వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. ఈ క్రమంలో భుజంనొప్పి సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా రెండు భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడం సమస్య నేపథ్యంలో ఆయన తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసిముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొవడానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన వైద్య పరీక్షల నిమిత్తం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి బయలు దేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ గారి వెంట సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఉన్నట్లుండి ముంబై ఆస్పత్రికి వెళ్లడంతో జనసేత నేతలు, కార్యకర్తలు టెన్షన్ కు గురౌతున్నారు. తమ అభిమాన నేత వెంటనే కోలుకొవాలని ప్రత్యేకంగా ప్రార్థనలు సైతం చేస్తున్నారు. మరోవైపు ఇటీవల పవన్ కళ్యాన్ రెండు తెలుగురాష్ట్రాల్లో తన వ్యాఖ్యలతో హల్ చల్ చేస్తున్నారు. తెలంగాణ నీ బ్బా