హుటాహుటిన ముంబైకి పవన్..! రిలయన్స్ ఆస్పత్రిలో చేరిక
Actor ProfilePolitician

హుటాహుటిన ముంబైకి పవన్..! రిలయన్స్ ఆస్పత్రిలో చేరిక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హుటాహుటిన ముంబైకి పవన్..! రిలయన్స్ ఆస్పత్రిలో చేరిక
Oneindia Telugu15 Aug 2026
హుటాహుటిన ముంబైకి పవన్..! రిలయన్స్ ఆస్పత్రిలో చేరిక

గత కొంతకాలంగా భుజాల కండరాల గాయాలతో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan kalyan) చికిత్స కోసం ఇవాళ ముంబై బయలుదేరి వెళ్లారు. భార్య అన్నా లెజ్ నోవాతో కలిసి ఆయన ఇవాళ ముంబై చేరుకున్నారు. అక్కడ రిలయన్స్ సంస్థకు చెందిన కోకిలా బెల్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో పవన్ ముందుగా పరీక్షలు చేయించుకోనున్నారు. అనంతరం పవన్ కు శస్త్రచికిత్స అవసరమా లేదా అన్న విషయాన్ని డాక్టర్లు నిర్ధారించే అవకాశం ఉంది. పవన్ పై ఒత్తిడి పెంచేస్తున్న వైసీపీ..! రంగంలోకి చంద్రబాబు కేబినెట్ ..!ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఓవైపు పార్టీని చూసుకుంటూ, మరోవైపు అధికారుల సమీక్షలు, పర్యటనలతో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ఇదే క్రమంలో ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో పాటు మధ్యలో కొన్ని గతంలో ఒప్పుకున్న సినిమాలు సైతం పూర్తి చేయాల్సి వచ్చింది. ఇందులో మరింత ఒత్తిడికి గురి కావడంతో ఆయన రెండు భుజాల కండరాలు చిట్లినట్లు తెలుస్తోంది. దీంతో పాటు భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం కూడా అయింది. Amaravati: అమరావతిలో వైసీపీకి పట్టు చిక్కిందా ? టీడీపీ దాడుల వెనుక ఏముంది ?దీంతో గతంలో వైద్యం తీసుకున్నాక తాత్కాలిక విశ్రాంతి మాత్రమే తీసుకున్న పవన్ తిరిగి విధుల్లోకి వచ్చేశారు. కానీ ఈ మధ్య కేబినెట్ భేటీలో సైతం కూర్చొనే పరిస్ధితులు లేకపోవడంతో ఆయన మధ్యలోనే హఠాత్తుగా వెళ్లిపోతున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి పవన్ ముంబైకి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత ఆయన ఆరోగ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది