హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా
Actor ProfileActor

హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా
NTV Telugu7 Aug 2026
హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా

సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ స్టార్ అవ్వాలంటే కచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఉండాలనే ఫార్ములా నడుస్తుంది. కానీ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ రివర్స్ అయ్యాయి. తెలుగులో ఇప్పటివరకు ఒక్క సాలిడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ కూడా లేకపోయినా, ఈ భామకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా తన గ్లామర్, స్క్రీన్ ప్రెసెన్స్, డాన్స్‌తో మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘కింగ్డమ్’, రామ్ సరసన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. నిర్మాతలు, దర్శకులు ఆమెలో ఉన్న పాన్ ఇండియా ఫేస్, కెమెరా ఫ్రెండ్లీ లుక్‌ను నమ్ముతున్నారు. తాజాగా ఈ బ్యూటీ తెలుగు బోర్డర్లు దాటేసి కోలీవుడ్, మోలీవుడ్‌లోనూ జెండా పాతేస్తోంది. కమల్ హాసన్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘సియాన్’లో శివకార్తికేయన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న ‘L367’ చిత్రం ద్వారా మలయాళంలోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది