హే చికీతా’ టీజర్ ఎలా ఉందంటే
Actor ProfileActor

హే చికీతా’ టీజర్ ఎలా ఉందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హే చికీతా’ టీజర్ ఎలా ఉందంటే
Chitrajyothy3 Aug 2026
హే చికీతా’ టీజర్ ఎలా ఉందంటే

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ల పై.. ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘హే చికీతా’. తాజాగా ఈ మూవీ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ల పై.. ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘హే చికీతా’ (Hey Chikittha). ధన్ రాజ్ లెక్కల (DhanRaj Lekkala) దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అభినవ్ మణికంఠ (Abhinav Manikanta), దివిజ (Divija Prabhakar), తన్మయి కుషి ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీ జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఈ చిత్రం టీజర్‌ని సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, జి. నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి నిర్మాతలు సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, రామసత్య నారాయణ.. దర్శకులు నాగేశ్వర్ రెడ్డి, దశరథ్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా టీజర్‌ని గమనిస్తే.. ప్రస్తుతం పల్లెటూర్లలో యూత్ పరిస్థితి ఎలా ఉంది? అక్కడి ప్రేమలు ఎలా ఉన్నాయి? రైతులు, తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారనే విషయాలను హైలెట్ చేస్తూ.. ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లుగా టీజర్ తెలియజేస్తోంది. ఉద్యోగం ఉంటేనే పిల్లనిచ్చి పెళ్లి చేస్తామనే రోజులివి. ఆ విషయాన్ని చక్కని ప్రేమకథతో ఇందులో తెలిపినట్లుగా తెలుస్తోంది. నేచురల్ లొకేషన్స్‌, సెన్సిబుల్ మ్యూజిక్‌ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ.. ‘గరుడవేగ’ అంజి వల్లే నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. నన్ను నమ్మి, నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్‌కు థాంక్స్. నేను పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఊర్లో ఉండే ఓ