
మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చంద్రబాబుపైనా అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై నమోదైన కేసులో కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలు రాజ్యాంగ, చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ దానిని రద్దు చేయాలని కొడాలి నాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటీషన్ పైన కోర్టు తీసుకునే నిర్ణయం పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.2021లో జరిగిన స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల కోడ్)ను ఉల్లంఘించారనే ఆరోపణలపై నమోదైన పాత కేసులో ఆయనపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం పైన స్పందించిన కొడాలి నాని న్యాయపోరాటానికి దిగారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రాసిక్యూషన్ ఆర్డర్లను సవాల్ చేస్తూ తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంబంధిత జీవోను రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటిస్తూ దానిని రద్దు చేయాలని కోరారు. ఘటన 2021 ఫిబ్రవరి జరిగిందని, క్రిమినల్ చట్టాల ప్రకారం తన పై నమోదైన సెక్షన్ల కింద కేసును కాగ్నిజెన్స్‌లోకి తీసుకొనే కాలపరిమితి ముగిసిందని తెలిపారు. జమిలి, డీలిమిటేషన్ ఇక ఖాయం - మోదీ లెక్క పక్కా, ముహూర్తం ఫిక్స్..!!హైకోర్టులో పిటీషన్ దాఖలుతోఇలాంటి కేసుల్లో ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. కాగా, వైసీపీ హయాంలో నాటి పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని ఎస్‌ఈసీ జాయింట్ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుడివాడ పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను అనుమతించాలని ప్రతిపాదిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 5న కృష్ణాజిల్లా కలెక్టర్ లేఖ రాశారు. దాని ఆధారంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఇటీవల అనుమతి ఇచ్చారు. గతంలో కూడా ఇదే అంశంపై ఆయన కోర్టు నుంచి కొన్ని ఉపశమనాలు