
హిమాలయాల్లోని అన్నపూర్ణ పర్వతశ్రేణి ఎక్కాలని దశాబ్దం ముందు అనుకున్నా కానీ కుదరలేదు. హిమాలయాల్లోని అన్నపూర్ణ పర్వతశ్రేణి ఎక్కాలని దశాబ్దం ముందు అనుకున్నా కానీ కుదరలేదు. ఒకరోజు హఠాత్తుగా ‘ఇప్పుడు కాదంటే ఎప్పుడూ కాదు మిహిర్!’ అన్నాను 22 ఏళ్ళ కొడుకుతో. నేపాల్‌లోని పోఖర నగరం నిజమైన అర్థంలో సౌందర్యానికి, భద్రతకు, ప్రశాంతతకు ప్రతీక. ప్రతీ కట్టడం, రెస్టారెంట్ తమ ప్రత్యేకతను చాటుతుంటాయి. ప్రపంచం నలు మూలల నుంచి హిమాలయాల ప్రేమికులు ఇక్కడ స్వేచ్ఛగా, ఆనందంగా సంచరిస్తుం టారు. పోఖర నుంచి 45 కిలోమీటర్ల దూరంలోని ఝానుదండ గ్రామాన్ని మే 23న చేరుకున్నాం. అక్కడి నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నపూర్ణ బేస్‌క్యాంప్‌నకు వెళ్లిరావడానికి 8 రోజులు పడుతుందని చెప్పారు ట్రెక్కింగ్ ఆపరేటర్స్. మొత్తం 56 నుంచి 60 కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగాలి. ఈ గ్రామం సముద్ర మట్టానికి 1780 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అన్నపూర్ణ బేస్ క్యాంప్ (ఏబీసీ) ఎత్తు 4130 మీటర్లు. నడక మొదలు పెట్టగానే, హిమాలయాల్లో లేని పెద్ద పర్వతాలను అవతార్‌లో చూపించ లేదు అనిపించింది. చేతిలో రెండు కర్రలు, చలికి రక్షణగా ఒక జత బట్టలు, ట్రెక్కింగ్ బూట్లు. సన్నని దారి కిందికి అవరోహణ. ఆ తర్వాత అరగంట ఆరోహణ. ఏబీసీ నుంచి తిరిగి వస్తున్న వారిలో దాదాపు అంతా యుక్త వయస్కులే. వాళ్ళు నాతో బెస్టాఫ్ లక్ అంటుంటే చాదస్తం అనుకున్నా. అందులో సాహసం చేస్తున్నారనే ధ్వని నడిచేకొద్ది అర్థం అయ్యింది. వయసు నలభై దాటినవాళ్లు అరుదుగా కనిపించారు. అరగంట కొండ ఎక్కగానే, ఆగి శ్వాస తీసుకుని ‘బాగా ఆలోచించే బయలుదేరాం కదా’ అనే సందేహం. మలుపు వరకు బండలు లేకపోతే, పర్లేదు ఎక్కగలం అనుకోవడం. మలుపు దాటగానే చాలా మెట్లు కనిపిేస్త, ఓహ్ అంతే కదా అనుకోవడం. గంట తర్వాత కంచర గాడిదలు సరుకులు మోసుకెళ్లడం కనిపిేస్త, వాటిమీద తిరిగి వచ్చే అవకాశం ఉండవచ్చు