సవాళ్లు విసరడం ఎందుకు.. అడ్డుకోవడం ఎందుకు
Actor ProfilePolitician

సవాళ్లు విసరడం ఎందుకు.. అడ్డుకోవడం ఎందుకు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సవాళ్లు విసరడం ఎందుకు.. అడ్డుకోవడం ఎందుకు
Andhra Jyothy1 Sept 2026
సవాళ్లు విసరడం ఎందుకు.. అడ్డుకోవడం ఎందుకు

గురుకులాల నిర్వహణ, అవినీతి ఆరోపణల అంశంపై గన్‌పార్క్‌ దగ్గర మంత్రులతో చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్, జులై 2: గురుకులాల నిర్వహణ, అవినీతి ఆరోపణల అంశంపై గన్‌పార్క్‌ దగ్గర మంత్రులతో చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. గురుకులాల విషయంలో చర్చ కోసం తాము ప్రెస్‌క్లబ్‌కు రమ్మంటే.. మంత్రులు గన్‌పార్క్ దగ్గరకు రమ్మన్నారని అన్నారు. ‘మీరు రమ్మన్న చోటుకే వస్తున్నాం.. మాకెలాంటి భేషజాలు లేవు. మేం వచ్చే వరకు మంత్రులు అక్కడే ఉండాలి. ఎలాంటి గొడవలు వద్దు.. కూర్చుని మాట్లాడుకుందాం’ అని అన్నారు. చర్చకు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సవాళ్లు విసరడం ఎందుకు? అడ్డుకోవడం ఎందుకు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మేం వెళ్తున్నది గొడవలకు కాదు.. చర్చలకు’ అని చెప్పుకొచ్చారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం పారిపోయిందంటూ దుయ్యబట్టారు. అవినీతి జరిగింది కాబట్టే భయపడుతున్నారన్నారు. తాము చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. మరోవైపు గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గన్‌పార్క్‌కు ముగ్గురు మంత్రులూ చేరుకుని.. అమరవీరుల స్థూపం దగ్గర కూర్చున్నారు. మంత్రులకు మద్దతుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గన్‌పార్క్‌కు వచ్చారు. తెలంగాణ మంత్రులు, మాజీ మంత్రుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో గన్‌పార్క్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అటు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్, తెలంగాణ భవన్ దగ్గర కూడా పోలీస్ బలగాలు మోహరించారు. టీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్న పోలీసులు.. విద్యుత్ అంతరాయాల నివారణకు