సవాల్ విసురుతోన్న గంజాయి డాన్ నీతూబాయికి పోలీసులు బుల్డోజర్’ ట్రీట్మెంట్
Actor ProfileCelebrity

సవాల్ విసురుతోన్న గంజాయి డాన్ నీతూబాయికి పోలీసులు బుల్డోజర్’ ట్రీట్మెంట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సవాల్ విసురుతోన్న గంజాయి డాన్ నీతూబాయికి పోలీసులు బుల్డోజర్’ ట్రీట్మెంట్
Samayam Telugu21 Jun 2026
సవాల్ విసురుతోన్న గంజాయి డాన్ నీతూబాయికి పోలీసులు బుల్డోజర్’ ట్రీట్మెంట్

ఐటీ కారిడార్‌ కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ అమ్ముతూ తెలంగాణ పోలీసులు , ఎక్సైజ్ అధికారులకు సవాల్ విసురుతోన్న ధూల్ పేట్‌కు చెందిన లేడీ డాన్ నీతూబాయి ఆటకట్టించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె నివాసంపై బుల్డోజర్‌ అస్త్రాన్ని అధికారులు ప్రయోగించారు. నానక్‌రాంగూడ లోథాబస్తీలో తన ఇంటి ముందు ఆక్రమించి నిర్మించిన కిరాణా షాపు, రేకుల షెడ్డును శనివారం జేసీబీలతో కూల్చి వేశారు. ఈ కిరాణా కొట్టు మాటున నిందితురాలు గంజాయి విక్రయాలు గుట్టుగా సాగిస్తోంది. ఆమె 20కిపైగా గంజాయి అమ్మకం కేసుల్లో నిందితురాలిగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈగల్‌ టీమ్ నీతూబాయిపై నిఘా పెట్టి... పలుమార్లు ఆకస్మిక దాడులు చేస్తోంది. గతవారం ఈ డాన్ ఇంటిపై నిర్వహించిన మెరుపు దాడుల్లో 47 మంది వినియోగదారులు పట్టుబడ్డారు. కానీ, ఆమె మాత్రం తప్పించుకుంది. అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. గంజాయి అమ్మకానికి కిరాణా కొట్టునే కేంద్రంగా చేసుకున్నట్టు ఈగల్‌ టీమ్ గుర్తించింది. ఆ దుకాణం రోడ్డును ఆక్రమించి కట్టడంతో దాన్ని కూలగొట్టారు. సమీపంలోని మరికొందరు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలనూ కూడా తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నీతూ బాయి దాదాపు పదేళ్లుగా నానక్‌రామ్‌గూడలోని తన ఇంటినే గంజాయి అడ్డాగా మార్చి, కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేస్తోంది. ఆమెపై 2017 నుంచి 2024 వరకు ఎన్డీపీఎస్, ఎక్సైజ్ చట్టాల కింద దాదాపు 20 కేసులు నమోదుకావడం గమనార్హం. పలుసార్లు అరెస్టై జైలుకెళ్లినా ఆమె మాత్రం దందా ఆపలేదని పోలీసులు తెలిపారు. 2023లో ఓ భారీ గంజాయి రాకెట్ బయటపడగా.. ఆ కేసులో నీతూబాయిని అరెస్టు చేసి రూ.40.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, 16 బ్యాంకు ఖాతాల్లో ఏకంగా రూ.1.53 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు చెందిన దాదాపు రూ.2 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఆమె నివాసంపై 2024లో దాడులు చేసినప్పుడు భారీ ఎత్తున గంజాయి