సలార్’ మేకర్స్ తో సూర్య సినిమా.. జై భీమ్’ కాంబో రిపీట్
Actor ProfileActor

సలార్’ మేకర్స్ తో సూర్య సినిమా.. జై భీమ్’ కాంబో రిపీట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సలార్’ మేకర్స్ తో సూర్య సినిమా.. జై భీమ్’ కాంబో రిపీట్
Samayam Telugu16 Aug 2026
సలార్’ మేకర్స్ తో సూర్య సినిమా.. జై భీమ్’ కాంబో రిపీట్

తమిళ హీరో సూర్య ‘వీరభద్రుడు’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. తమిళంలో 'కరుప్పు' పేరుతో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ. 340 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ జోష్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘KGF’, ‘కాంతార’, ‘సలార్’ వంటి హిట్‌ ప్రాంచైజీలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్‌’తో సూర్య ఓ సినిమా చేస్తున్నారు. టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘జై భీమ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఆ వివరాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.#SuriyaXHombale మూవీలో సూర్య సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్ఆర్ కథిర్ సినిమాటోగ్రఫీ.. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. చిత్రబృందం త్వరలోనే టైటిల్, విడుదల తేదీని ప్రకటించనుంది