సమంతకి పోటీగా దిగిన నాగచైతన్య
Actor ProfileActor

సమంతకి పోటీగా దిగిన నాగచైతన్య

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సమంతకి పోటీగా దిగిన నాగచైతన్య
Zee Telugu19 Jun 2026
సమంతకి పోటీగా దిగిన నాగచైతన్య

Samantha vs Naga Chaitanya :ఈ శుక్రవారం టాలీవుడ్‌లో ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు భార్యాభర్తలుగా ఉన్న సమంత, నాగ చైతన్య ఇప్పుడు తమ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో మరోసారి సమంత వర్సెస్ నాగ చైతన్య అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రాన్ని సమంత స్వయంగా నిర్మించారు. ఆమె భర్త రాజ్ నిడిమోరు కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరోవైపు నాగ చైతన్య నేరుగా నటించకపోయినా, ఈరోజే విడుదలైన బాలన్: ది బాయ్ సినిమాకు మద్దతుగా నిలిచారు. సాధారణంగా ఇతర సినిమాల ప్రమోషన్లలో పెద్దగా కనిపించని చైతన్య, ఈసారి ప్రత్యేకంగా స్పందించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో విడుదల చేస్తున్న ఈ థ్రిల్లర్‌ను ప్రత్యేక ప్రదర్శనలో చూసిన చైతన్య ప్రశంసల వర్షం కురిపించారు. “సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడే గూస్‌బంప్స్ వస్తున్నాయి. మొదట ఇది తల్లి-కొడుకు కథ అనుకున్నాను. కానీ కొద్ది నిమిషాలకే కథ ఊహించని మలుపులు తిరుగుతుంది” అని నాగ చైతన్య తెలిపారు. ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్లి ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు. అలాగే సినిమా కథ, విజువల్స్, సంగీతం అన్నీ అద్భుతంగా కుదిరాయని ప్రశంసించారు. మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం లాంటి విజయాల సరసన ఈ సినిమా కూడా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా ఒకవైపు సమంత నటించిన మా ఇంటి బంగారం, మరోవైపు నాగ చైతన్య మద్దతు ఇస్తున్న బాలన్: ది బాయ్ ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రావడంతో బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారింది. అయితే