'పెద్ది' సినిమాతో బోసిపోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్లీ ఊపొచ్చింది. ఒరిజినల్ గా ఎంత కలెక్ట్ చేసింది?, అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా? వంటి చర్చలను పక్కనబెడితే.. ఈ సినిమా జనాలను థియేటర్లకు రప్పించిందనేది వాస్తవం. ఎప్పటిలాగే ప్రేక్షకులు సినిమాలు చూడటానికి వస్తారనే నమ్మకంతో.. ఇప్పుడు వరుస చిత్రాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ వారం దాదాపు అర డజను సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. ఆమె భర్త రాజ్ నిడిమోరు క్రియేటర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. సామ్ యాక్షన్ అవతార్ లో అదరగొట్టారు. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం.‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మలయాళ దర్శకుడు చిదంబరం.. ఇప్పుడు ‘బాలన్: ది బాయ్’ అనే సినిమాతో అలరించడానికి వస్తున్నారు. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. జూన్ 19న విడుదల కానుంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అక్కినేని నాగ చైతన్య ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసి, ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పోస్ట్ పెట్టారు. తెలుగు రిలీజులో అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పోటీగా 'బాలన్' థియేటర్లలోకి వస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే, ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో అలరించిన సీనియర్ హీరో వడ్డే నవీన్.. సుదీర్ఘ విరామం
Actor ProfileActor
సమంత సినిమాకి పోటీగా అక్కినేని వారి బాలన్’.. నాగ చైతన్య ట్వీట్ వైరల్
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Jun 2026
సమంత సినిమాకి పోటీగా అక్కినేని వారి బాలన్’.. నాగ చైతన్య ట్వీట్ వైరల్