
సమంత లైఫ్ ఒక సక్సెస్ స్టోరీ. ఆమె ఎంతో మందికి ఆదర్శమని చెప్పొచ్చు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఫేస్ చేసింది. వ్యక్తిగత జీవితంలో చాలా కోల్పోయింది. పెళ్లి పెటాకులయ్యింది. ఆ తర్వాత అనారోగ్యంతో పోరాడింది. వీటి నుంచి బయటపడే లోపే తండ్రి మరణించాడు. ఇలా సమంతకి ఒకేసారి దెబ్బ మీద దెబ్బ పడ్డాయని చెప్పొచ్చు. అయినా స్ట్రాంగ్‌గా ఉంది. స్ట్రాంగ్‌గా నిలబడింది. ఇప్పుడు మళ్లీ నటిగా బిజీ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా `మా ఇంటి బంగారం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది సమంత. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తన భర్త రాజ్ నిడిమోరు నిర్మించడం, కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో సాగే ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో సమంత చేసే యాక్షన్ అదిరిపోయింది. ప్రస్తుతం సమంత చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలో అనేక విషయాలను పంచుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు దక్కుతున్న ఆదరణ, మహిళలపై చిన్న చూపు, హీరోయిన్ల పారితోషికాలు వంటి అంశాల గురించి మాట్లాడింది. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాను తీసుకున్న సంచలన నిర్ణయాన్ని బయటపెట్టింది. సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఒక స్టేటస్ వచ్చాక.. సినిమాలతోపాటు యాడ్స్ చేస్తుంటారు. కమర్షియల్ యాడ్స్ ద్వారా బాగా సంపాదిస్తుంటారు. సినిమాల కంటే ఇలా సైడ్ బిజినెస్‌ల ద్వారానే ఎక్కువగా సంపాదిస్తుండటం విశేషం. సమంత కూడా చాలా కమర్షియల్ యాడ్స్ చేసింది. కోట్ల పారితోషికాలు తీసుకుంది. కానీ తన జీవితంలో జరిగిన సంఘటనల తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కమర్షియల్ యాడ్స్ చేయకూడదని నిర్ణయించుకుందట. అయితే తాను నమ్మని ఏ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయోద్దని నిర్ణయించుకుందట. తాను వాడని, వాటిపై నమ్మకం లేని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండకూడదని నిర్ణయం