సమంత లేడీ సూపర్ స్టార్ కాదా.. పూనమ్ అంత మాట అనేసిందేంటి
Actor ProfileActor

సమంత లేడీ సూపర్ స్టార్ కాదా.. పూనమ్ అంత మాట అనేసిందేంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సమంత లేడీ సూపర్ స్టార్ కాదా.. పూనమ్ అంత మాట అనేసిందేంటి
Chitrajyothy1 Jul 2026
సమంత లేడీ సూపర్ స్టార్ కాదా.. పూనమ్ అంత మాట అనేసిందేంటి

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పేర్లు ఎక్కడ వినిపిస్తే అక్కడ పూనమ్ ఉంటుంది. టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పేర్లు ఎక్కడ వినిపిస్తే అక్కడ పూనమ్ ఉంటుంది. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా దానిపై తన అభిప్రాయాన్ని చెప్తూ ఉంటుంది. తాజాగా ఆమె సమంత (Samantha)పై సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం జూన్ 19 న రిలీజ్ అయ్యి మంచి కలక్షన్స్ రాబడుతోంది. మా ఇంటి బంగారం విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.43 కోట్ల గ్రాస్ వసూలు చేసి సమంత సత్తా చాటింది. దీంతో నెటిజన్స్ సమంత రేంజ్ ఇది.. ఆమె టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అని ప్రశంసిస్తున్నారు. తాజాగా పూనమ్.. సమంత లేడీ సూపర్ స్టార్ వ్యాఖ్యలపై స్పందించింది. సోషల్ మీడియాలో మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ తరువాత .. టాలీవుడ్‌లోనే సమంత ఎవర్ గ్రీన్ బిగ్గెస్ట్ సూపర్ స్టారా.. ? అని ఉన్న పోస్ట్ ని షేర్ చేస్తూ.. ' అనుష్క శెట్టిని ఎవరూ దాటలేరు.. కలలు కనండి' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అనుష్కని కొట్టేవారు లేరు.. కాదనడం లేదు. కానీ, ఇప్పుడామె ఎక్కువ సినిమాలు చేయడం లేదు. అలాంటప్పుడు సామ్ ని అనడంలో తప్పు లేదు అని కొందరు. అవును.. స్వీటీనే లేడీ సూపర్ స్టార్ అని ఇంకొందరు. నీకు.. అత్తారింటికి దారేది సినిమాలో ఎవరూ నచ్చారనుకుంటా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి పూనమ్ వ్యాఖ్యలపై సమ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి